నవతెలంగాణ – పరకాల
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను శుక్రవారం పరకాల నియోజకవర్గంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొని, రాహుల్ గాంధీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో, నడికూడ మండలం ధర్మారం గ్రామంలో ఏర్పాటు చేసిన వేడుకల్లో ఆయన కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడుతూ, దేశ యువతకు ఆదర్శంగా నిలుస్తున్న రాహుల్ గాంధీకి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు కలగాలని ఆకాంక్షించారు. సామాజిక న్యాయం కోసం నిలబడుతున్న ఆయనకు భగవంతుడు మరింత శక్తిని, విజయాలను ప్రసాదించాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.



