- Advertisement -
నవతెలంగాణ-మద్నూర్
ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి రేవంత్ రెడ్డి సర్కార్ ప్రత్యేక చర్యలకు పూనుకుందని, ఇది ఎంతో సంతోషించదగ్గ విషయమని చిన్న ఎక్లారా సర్పంచ్ మాధవరావు అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక పాఠశాలలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ప్రభుత్వ బడుల్లో కల్పిస్తున్న సౌకర్యాలను వినియోగించుకోవాలని విద్యార్థుల తలిదండ్రులకు సూచించారు. కార్యక్రమంలో ఉపసర్పంచ్ చంద్రకాంత్, వార్డ్ సభ్యులు రాజు పటేల్, గ్రామ కార్యదర్శి, పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, పాల్గొన్నారు.
- Advertisement -



