నవతెలంగాణ-కుభీర్
మండల కేంద్రమైన కుభీర్ లోని కస్తూరిబా గాంధీ పాఠశాలను గురువారం మండల ఎంపీడీఓ బీమేష్ సందర్శించారు. ఈ సందర్బంగా పాఠశాలలో విద్యార్థులను మెనూ ప్రకారం భోజనం అందుతుందా లేదా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. దింతో పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయులు విద్యార్థుల హాజరు పట్టికతో పాటు వంట గది, బాత్రూం లను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.
ఈ సందర్బంగా ఎంపీడీఓ మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే విద్యార్థులను ప్రభుత్వం అన్ని సౌకర్యలు అందించడం జరుగుతుందన్నారు. గ్రామంలో ఉన్న ప్రతి ఒక్క తల్లిదండ్రులు ప్రయివేట్ పాఠశాలలో అధిక ఫీజు ల వల్ల ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదురుకున్న పరిస్థితులు ఉన్నాయి దింతో ప్రభుత్వ పాఠశాలలో ఉచ్చిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, మధ్యాహ్న భోజనాన్ని అందించడం జరుగుతుంది. ఇందులో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు కూడా మంచి విద్యాభ్యాసం చేసి ఉంటారన్నారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి జాదవ్ మాధవ్ కేజీబీవీ ప్రత్యేక అధికారి వాణి విద్యార్థిని లు తదితరులు ఉన్నారు.



