Monday, August 4, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకొత్తగూడెం కలెక్టర్‌ జితేష్‌ పాటిల్‌ దంపతులకు అభినందనలు

కొత్తగూడెం కలెక్టర్‌ జితేష్‌ పాటిల్‌ దంపతులకు అభినందనలు

- Advertisement -

– మంత్రి దామోదర రాజనర్సింహ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తమ శిశువు జననం కోసం పాల్వంచ కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ను ఎంచుకున్న కొత్తగూడెం కలెక్టర్‌ జితేష్‌ పాటిల్‌, శ్రద్ధ పాటిల్‌ దంపతులను వైద్యారోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. ఈ మేరకు బుధవారం ఎక్స్‌ వేదికగా ట్వీట్‌ చేశారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రసూతి సేవలను ఉపయోగించుకున్నందుకు కలెక్టర్‌ను ప్రశంసించారు. కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌ ఆస్పత్రి సిబ్బంది అంకితభావంతో సేవలందించారని కొనియాడారు. ప్రజా ప్రతినిధులు తీసుకునే ఇలాంటి చర్యలు ప్రజా ఆరోగ్య వ్యవస్థ పట్ల విశ్వసనీయతను మరింత పెంచుతుందనీ, ఆ వ్యవస్థ బలోపేతానికి ఉపయోగపడుతుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -