Tuesday, March 3, 2026
E-PAPER
Homeకరీంనగర్ఎస్పీ స్టెప్పులతో పోలీసుల్లో ఉత్సాహం

ఎస్పీ స్టెప్పులతో పోలీసుల్లో ఉత్సాహం

- Advertisement -

జిల్లా ప్రజలకు, పోలీసు అధికారులకు, సిబ్బందికి హోలీ పండుగ శుభాకాంక్షలు
జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా హోలీ వేడుకలు..
నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల

జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో హోలీ పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ మహేష్ బిగితే ఆధ్వర్యంలో జరిగిన ఈకార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొని, పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటూ సంతోషంగా వేడుకలను జరుపుకున్నారు.
ఈ సందర్భంగా ఎస్పీ మహేష్ బిగితే జిల్లా ప్రజలందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ,హోలీ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో ఆనందం,ఐక్యత,కోత్త ఉత్సాహం, వెలుగులు నింపాలని ఆకాంక్షించారు. పోలీసు కుటుంబంలో స్నేహభావం, ఐక్యత మరింత బలపడేలా ఈ వేడుకలు నిర్వహించబడినట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ లు,ఆర్.ఐ లు, ఎస్.ఐ లు,సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -