నవతెలంగాణ-హైదరాబాద్: అంతర్జాతీయ అటామిక్ ఎనర్జీ ఏజెన్సీ (IAEA) మంగళవారం ఇరాన్‌లోని నటాంజ్ అణు సదుపాయానికి జరిగిన నష్టాన్ని ధృవీకరించింది. అయితే రేడియోలాజికల్ ప్రభావం లేదని స్పష్టం చేసింది. గతేడాది జూన్ సంఘర్షణలో ఇది తీవ్రంగా దెబ్బతిన్నది” అని IAEA ఎక్స్ వేదకగా పేర్కొంది. అంతకుముందు, ఇన్స్టిట్యూట్ ఫర్ ది స్టడీ ఆఫ్ వార్- US-ఇజ్రాయెల్ సోమవారం ఇరాన్‌లోకి జరిపిన దాడులు Natanz న్యూక్లియర్ ఫెసిలిటీని తాకినట్లు, కనీసం మూడు భవనాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని గమనించింది.
సోమవారం నాడు ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ అణు కేంద్రాలే లక్ష్యంగా సంయుక్త దాడులు చేశాయి. దీంతో ఫోర్డో, నతాంజ్ , ఎస్ఫహాన్ అణు కేంద్రాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ నేపథ్యంలో అణు కేంద్రాల నుంచి రేడియేషన్ లీక్ అవుతున్నట్లుగా నిపుణులు శాస్త్రవేత్తలు హెచ్చరించారు.
వాస్తవంగా అణు కేంద్రాలపై దాడి చేయకూడదని ఐక్యరాజ్యసమితిలోని అంతర్జాతీయ అణు శక్తి సంస్థ వార్నింగ్ ఇచ్చింది. కానీ తాజా దాడుల్లో అందుకు భిన్నంగా కనిపిస్తోంది. ప్రస్తుతం అమెరికా, ఇజ్రాయెల్ కూడా అణు కేంద్రాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నాయి.



