నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
హోలీ పండుగ సంబరాలు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, మున్సిపల్ చైర్ పర్సన్ తంగళ్ళపల్లి శ్రీవాణి రవికుమార్ తో కలిసి జరుపుకున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో రంగులు జల్లుతూ, బ్యాండ్ మేళా మధ్య డాన్సులు చేస్తూ హోలీ వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజక వర్గ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపారు.
మన సంస్కృతి సంప్రదాయాలు గొప్పవని, ప్రతీ పండగకు ఒక పరమార్థం ఉంటుందని అన్నారు. హోలీ అన్ని రంగుల కలయిక అని, సంతోషం, సామరస్యంతో కేరింతలు కొడుతూ నిర్వహించుకున్నట్లు తెలిపారు. భువనగిరి పట్టణంలో వాడవాడలా బైక్ ల పై తీరుతూ ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ హోలీ వేడుకలు నిర్వహించుకున్నామని అన్నారు.



