”మిస్సమ్మ’, ‘అదిరిందయ్యా చంద్రం’, ‘టాటా బిర్లా మధ్యలో లైలా’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’.
‘లిటిల్ హార్ట్స్’, ‘రాజు వెడ్స్ రాంబాయి’ వంటి విజయాల తర్వాత ఈటీవీ విన్‌తో కలిసి నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్న సినిమా ఇది. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా వస్తున్న ఈ సినిమాను ఈటీవీ విన్ అసోసియేషన్‌తో శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రిక్కి సమర్పణలో హీరో శివాజీ స్వయంగా నిర్మించారు. సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు. ఈనెల 6న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈసందర్భంగా హీరోయిన్ లయ మీడియాతో ముచ్చటించారు.
-శివాజీ, నేను కలిసి నటించి 20 ఏళ్లు అవుతుంది. ఈ చిత్రంలో నటించాలి అనగానే ఫ్యామిలీ డ్రామా అనుకున్నాను. కానీ ఇది అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ అనగానే నాకు ఇష్టమైన జోనర్లో ఉందనిపించింది. అందరికి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఈ కామెడీ సినిమాలో ఓ ఇంట్రెస్టింగ్ ట్విస్ట్‌తో పాటు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఇది డార్క్ కామెడీ జోనర్. కామెడీ క్రైమ్ థ్రిల్లర్ ఇది. కథ వినగానే యూనిక్ ఫీలింగ్ వచ్చింది.
-ఈ చిత్రంలో నేను ఉత్తర పాత్రలో నటించాను. ఇప్పటి వరకు నన్ను నేను ఇలాంటి పాత్రలో చూసుకోలేదు. నాకు కూడా ఈ పాత్ర వినగానే ఎంతో ఎగ్జైటింగ్‌గా అనిపించింది. మంగపతి లాంటి పవర్ఫుల్ పాత్ర చేసిన హీరోను డామినేట్ చేసే పాత్ర నాది. లయ అంటే ఏడిపించడం. ఏడవటం.. అనే గుర్తింపు ఉంది. కానీ ఈ సినిమాలో నేనే ఏడిపిస్తాను (నవ్వుతూ). స్వార్థంగా తన భర్త, ఫ్యామిలీ గురించి ఆలోచించే స్వార్థపరురాలి పాత్ర. నా భర్త బాగుండాలి అని కోరుకునే మనస్తత్వం ఉన్న పాత్ర ఇది.
-దర్శకుడు సుధీర్ శ్రీరామ్ స్టోరీ ఎంత బాగా రాసుకున్నాడో. అంత క్లారిటీగా తెరకెక్కించాడు. కాంప్రమైజ్ అవ్వని దర్శకుడు. ట్రైలర్ బాగుంది. అందరికి నచ్చింది అంటున్నారు. సినిమా కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. అందరిని సంతప్తిపరిచే సినిమా ఇది. అందరూ ఓ మంచి సినిమా అనే శాటిస్ఫాక్షన్తో వెళ్లిపోతారు.
-ఈ సినిమా విడుదలను ప్రారంభంలో థియేటర్‌కే అనుకున్నాం. కానీ మధ్యలో అనుకోకుండా ఓటీటీలో స్ట్రీమింగ్ అన్నారు. దీంతో కొంచెం డిజప్పాయింట్ అయ్యాను. అయితే మళ్లీ చాలా మంది ప్రముఖులు సినిమా చూసి ఇది థియేటర్లో విడుదల చేసే సినిమా అని అనడంతో మళ్లీ థియేటర్లోకి వస్తోంది.
-‘వదల’ అనే సినిమాలో జగపతిబాబు భార్యగా చేస్తున్నాను. శ్రీకాంత్‌తో కూడా ఓ సినిమా చేస్తున్నాను. నాగేశ్వర రెడ్డి దర్శకుడు. ‘యమలీల’ తరహాలో సోషియో ఫాంటసీ సినిమా. ‘వదల’ అనేది సైకలాజికల్ థ్రిల్లర్.
ఈ సినిమాలో నేనే ఏడిపిస్తా..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



