Wednesday, March 4, 2026
E-PAPER
Homeతాజా వార్తలుతెలంగాణ వర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ..

తెలంగాణ వర్సిటీలో విద్యార్థుల మధ్య ఘర్షణ..

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : తెలంగాణ విశ్వవిద్యాలయంలో విద్యార్థుల మధ్య ఘర్షణ జరిగింది. కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి శివారులో ఉన్న వర్సిటీ సౌత్‌ క్యాంపస్‌ వసతిగృహంలో మంగళవారం అర్ధరాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది. హోలీ సంబరాల అనంతరం సీనియర్‌, జూనియర్‌ విద్యార్థులు రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం దాడులకు పాల్పడ్డారు. దీంతో పలువురికి గాయాలయ్యాయి. వర్సిటీ సిబ్బంది వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. వసతిగృహం వద్దకు స్థానిక ఎస్సై ఆంజనేయులు, వార్డెన్‌ డాక్టర్‌ యాలాద్రి అక్కడికి చేరుకొని విద్యార్థులతో మాట్లాడారు. విచారణ అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -