Wednesday, March 4, 2026
E-PAPER
Homeజిల్లాలుఅధిక శబ్ద సైలెన్సర్లపై పోలీసుల ఉక్కుపాదం

అధిక శబ్ద సైలెన్సర్లపై పోలీసుల ఉక్కుపాదం

- Advertisement -

– 150 సైలెన్సర్లను రోడ్డు రోలర్‌తో ధ్వంసం 
నవతెలంగాణ – కామారెడ్డి

కామారెడ్డి జిల్లా కేంద్రంలో అధిక శబ్దం చేసే సైలెన్సర్లపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. కొన్ని బైకులకు విపరీతమైన శబ్దం వచ్చే విధంగా మార్పులు చేసి యువత రోడ్లపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా సుమారు 150 అధిక శబ్ద సైలెన్సర్లను స్వాధీనం చేసుకుని, నిజాం సార్ చౌరస్తాలో రోడ్డు రోలర్‌తో ధ్వంసం చేశారు. వాహనదారులపై జరిమానాలు విధించారు.

ఈ కార్యక్రమం అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి ఆధ్వర్యంలో, పట్టణ సీఐ నరహరి పర్యవేక్షణలో నిర్వహించారు. ట్రాఫిక్ ఎస్ఐ మహేష్‌తో పాటు ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు. పట్టణ సీఐ నరహరి మాట్లాడుతూ, అధిక శబ్దంతో ప్రజలను ఇబ్బందులకు గురిచేసే వాహనాలపై కచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. నిబంధనలు ఉల్లంఘించిన వాహనాల సైలెన్సర్లను స్వాధీనం చేసుకుని ధ్వంసం చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు. ప్రజలు రోడ్డు భద్రత నిబంధనలు పాటిస్తూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -