ఇరాన్ దాడిలో చనిపోయినట్టు కథనాలు … వీడని ఇజ్రాయిల్ ప్రధాని మిస్టరీ
టెహ్రాన్ : ఖమేనీ హత్యతో రగిలిపోతున్న ఇరాన్ పశ్చిమాసియాను నిప్పుల కొలిమిలా మార్చేస్తోంది. ఇటీవల ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహు నివాసంపై కూడా క్షిపణుల దాడులతో విరుచుకుపడింది. ఆ దాడిలో నెతన్యాహు చనిపోయాడని ఇరాన్ ప్రకటిస్తే.. అబద్ధమంటూ ఇజ్రాయిల్ అంటోంది. మూడు రోజులైనా నెతన్యాహు జాడ ఎక్కడా కనిపించటంలేదు. దీంతో ఇజ్రాయిల్ ప్రధాని ”లైవ్.. ఆర్ డెత్” అన్న మిస్టరీ హల్చల్గా మారింది.
నెతన్యాహు ఇజ్రాయిల్‌ను విడిచిపెట్టాడా?
ఖమేనీ హత్య తర్వాత నెతన్యాహు సజీవంగా ఉన్నాడా లేదా అన్న దానిపై ఊహాగానాలు మరింతగా ఊపందుకున్నాయి. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు దేశం నుంచి సురక్షిత ప్రదేశానికి పారిపోయారని సోషల్ మీడియాలో వాదనలు వ్యాపించాయి. అయితే ఈ విషయంపై ఇంకా సస్పెన్ప్ కొనసాగుతోంది. టెహ్రాన్‌పై ఇజ్రాయిల్ దాడి చేసిన వెంటనే.. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో ధ్రువీకరించని అనేక ప్రొఫైల్‌లు నెతన్యాహు గ్రీస్‌కు పారిపోయాడని పేర్కొన్నాయి.
ఒక వినియోగదారు ఇలా రాశారు, ”నెతన్యాహు విమానం ఇజ్రాయిల్ తీరం మీదుగా తిరిగిన తర్వాత గ్రీస్‌కు వెళ్లింది.” అని పోస్టు చేశారు. అయితే, విమాన డేటా వేరే కథను చెబుతుంది. ”వింగ్ ఆఫ్ జియాన్” అని పిలువబడే 4 ఎక్స్- ఐఎస్ఆర్ నంబర్ కలిగి ఉన్న ఇజ్రాయిల్ ప్రధాన మంత్రి అధికారిక విమానం ఫ్లైట్ రాడార్‌లో ట్రాక్ చేయబడింది. డేటా ప్రకారం.. బోయింగ్ 767-338 ఈఆర్ విమానం ఫిబ్రవరి 28 రాత్రి బీర్షెబా నుంచి బయలుదేరి జర్మనీ రాజధాని బెర్లిన్‌లో ల్యాండ్ అయింది.
నెతన్యాహు ఆ విమానంలో ఉన్నారా?
స్వతంత్ర జర్నలిస్టులు, ఫ్లైట్ ట్రాకర్ల ప్రకారం, ”వింగ్ ఆఫ్ జియాన్” మధ్యాహ్నం 12:10 గంటలకు నెవాటిమ్ ఎయిర్ బేస్ నుంచి బయలుదేరింది. ఇజ్రాయిల్ తీరం మీదుగా దాదాపు 4 గంటలు తిరిగిన తర్వాత.. విమానం రాత్రి 8:30 గంటలకు బెర్లిన్‌లో దిగింది. ఆశ్చర్యకర విషయమేమిటంటే.. ప్రధాన మంత్రి నెతన్యాహుకు బెర్లిన్‌లో అధికారిక సందర్శనలు, సమావేశాలు ఏవీ షెడ్యూల్లో లేవు. అంతేకాదు, బెర్లిన్‌లో దిగిన విమానంలో నెతన్యాహు ఉన్నారా లేదా అనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. గ్రీస్ ల్యాండింగ్ అనుమతి నిరాకరించడంతో విమానాన్ని జర్మనీకి మళ్లించాల్సి వచ్చిందనే ఆన్లైన్ వాదనలు కూడా వెలువడుతున్నాయి.
నెతన్యాహు శనివారం ఇజ్రాయిల్ నుంచి ఒక వీడియో ప్రకటనను విడుదల చేశారు, అందులో ఇరాన్‌పై జరిగిన దాడులు, ఖమేనీ హత్య తీరును ఆయన నివేదించారు. రాయిటర్స్, బీబీసీ, ఏపీ వంటి వార్తా సంస్థలు ఆయన దేశం నుంచి బయలుదేరడాన్ని ఇంకా ధ్రువీకరించలేదు. బెంజమిన్ నెతన్యాహు జాడ ప్రస్తుతం మిస్టరీగా మిగిలిపోయింది. ”వింగ్ ఆఫ్ జియాన్”ను భద్రతా కారణాల దృష్ట్యా మాత్రమే బెర్లిన్‌కు పంపారా లేదా యుద్ధం కారణంగా ప్రధాని దేశం బయట ఉన్నారా? ఆయన ఎక్కడ ఉన్నారనే దానిపై ఇజ్రాయిల్ ప్రభుత్వం ఇంకా ఎటువంటి అధికారిక వివరణ ఇవ్వలేదు.



