నవతెలంగాణ – మల్హర్ రావు
ఛత్రపతి శివాజీ సేన ఆధ్వర్యంలో మండలం దుబ్బపేట గ్రామంలోని కస్తూర్బా ఆశ్రమ బాలికల పాఠశాల,పెద్దతుండ్ల గ్రామంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి విద్యార్థులకు పరీక్ష ఫ్యాడ్లు పెన్నులను గురువారం పంపిణీ చేశారు.విద్యార్థులు త్వరలోనే రాయబోతున్న పది వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించాలని ఆకాంక్షించారు. మండల వ్యాప్తంగా అత్యధిక మార్కులు ఎవరు సాధిస్తారో వారికి అద్భుతమైన బహుమతిని అందజేయడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో కస్తూరిబ్బా పాఠశాల ప్రత్యేకాధికారి భవాని,జిల్లా పరిషత్ పాఠశాల ఉపాధ్యాయులు, చత్రపతి శివాజీ సేన మండల కన్వీనర్ అజ్మీర నరేష్,చత్రపతి శివాజీ అభిమాని బండ శ్రీకాంత్ పటేల్,బండారీ శ్యామ్,ఊరుగొండ సాగర్, బండ సాయి కుమార్ పాల్గొన్నారు.
ఛత్రపతి శివాజీ సేన ఆధ్వర్యంలో విద్యార్థులకు పరీక్ష ప్యాడ్స్ అందజేత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



