Friday, March 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఎమ్మెల్యే సహకారంతో సీసీరోడ్డు పనులు ప్రారంభం 

ఎమ్మెల్యే సహకారంతో సీసీరోడ్డు పనులు ప్రారంభం 

- Advertisement -

రావిరాల గ్రామ సర్పంచ్ కత్తుల కళ్యాణి యాకాంతం 
నవతెలంగాణ – నెల్లికుదురు

మండలంలోని రావిరాల గ్రామంలో మహబూబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి నాయక్ సహకారంతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించినట్లు ఆ గ్రామ సర్పంచ్ కత్తుల కళ్యాణి యాకాంతం తెలిపారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధులైన రూ.5 లక్షలతో కొట్టం వెంకన్న ఇంటి నుండి రాస వెంకటరెడ్డి ఇంటి వరకు పాలెపు సాయిలు నుండి వార్షికల సుగుణమ్మ ఇంటి వరకు సీసీరోడ్డు నిర్మాణాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గ్రామాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి పరిచేందుకు ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళి సహకారంతో పూర్తి స్థాయిలో ముందుకు వెళ్దాం అని అన్నారు. గ్రామంలో అన్ని వీధులలో సీసీరోడ్డు ఏర్పాటు చేయడమే లక్ష్యమని చెప్పారు. ప్రజలు బురదమయంలో నడవకూడదు అనే ఉద్దేశంతో ఈ సీసీ రోడ్డు పనులను చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామంలోని గ్రామ ప్రజలకు ముందుగా ఏది అవసరం పడుతుందో దాన్ని గుర్తించి ప్రజల సమస్యల పరిష్కరణ మార్గంగా ముందుకు సాగుదాం అని అన్నారు.

గ్రామ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని తెలిపారు. గ్రామంలోని ప్రజలకు త్రాగునీరు వీధిలైట్లు సీసీరోడ్లు తోపాటు మౌలిక వసతులను అన్ని సమకూరుస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తరుణ్ వార్డు సభ్యులు సాగర్, సుప్రియ, స్వప్న, శ్రీకాంత్, వెంకట మల్లు, కుమార్, సూర్య ప్రకాష్, స్వప్న ,నాగమణి, గోరంట్ల భద్రయ్య, నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -