Friday, March 6, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఘనంగా సర్పంచ్ యాకాంతం గౌడ్ జన్మదిన వేడుకలు

ఘనంగా సర్పంచ్ యాకాంతం గౌడ్ జన్మదిన వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – నెల్లికుదురు
మండలంలోని బ్రాహ్మణ కొత్తపెల్లి గ్రామ సర్పంచ్ చిర్రా యాకాంతం గౌడ్ జన్మదిన వేడుకలను ఘనంగా గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులతో, ఎన్ జి ఎఫ్ సభ్యులతో కలిసి అంబేద్కర్ సెంటర్లో, శ్రీహరి తండాలో అనంతరం వారి స్వగృహంలో కేకులు కట్ చేసి మిఠాయిలు పంచుకొని సంబరాలు నిర్వహించారు.

జన్మదిన వేడుకను పురస్కరించుకొని పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు కష్టపడి చదివి ఉన్నత స్థాయికి ఎదగాలని వారికి పరీక్ష మెటీరియల్ ను అందించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ గ్రామ అభివృద్ధి నా లక్ష్యం అంటూ ప్రతి విద్యార్థి ఉన్నంత స్థాయికి ఎదిగేందుకు నా వంతు సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. గతంలో ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలను నిర్వహించామని ఇప్పుడు గ్రామంలో ప్రతి విషయంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించి గ్రామ ప్రజలను అభివృద్ధి పదం పై నడుపుతూ బ్రాహ్మణ కొత్తపల్లి గ్రామాన్ని అన్ని రంగాలుగా అభివృద్ధి పరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు నాయకులు ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -