Friday, March 6, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరొట్టెముక్క గొంతులో ఇరుక్కుని ఒకరు మృతి

రొట్టెముక్క గొంతులో ఇరుక్కుని ఒకరు మృతి

- Advertisement -

నవతెలంగాణ-నసురుల్లాబాద్‌
రొట్టెముక్క గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతిచెందిన ఘటన కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్‌ మండలంలో గురువారం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని దుర్కి గ్రామానికి చెందిన జరుగల చిన్న మొగులయ్య(45) భార్య జరుగల ఎల్లవ్వ మధ్య కుటుంబ సమస్యలు రావడంతో 13 ఏండ్లుగా భార్య పిట్లం మండలంలోని కుర్తి గ్రామంలో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది.

కూలీ పని చేసుకుంటూ జీవిస్తున్న మొగులయ్య ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎవరైనా పెట్టిందే తిని జీవనం గడుపుతున్నాడు. కాగా, గురువారం సైతం ఎవరో ఇచ్చిన ఎండు రొట్టె తింటున్న సమయంలో రొట్టె ముక్క గొంతులో ఇరుక్కుని ఊపిరి ఆడకపోవడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృతిపట్ల పూర్తిస్థాయి విచారణ జరిపి న్యాయం చేయాలని మృతుని భార్య ఎల్లవ్వ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -