Friday, March 6, 2026
E-PAPER
Homeజాతీయంబెంగాల్‌ గవర్నరు రాజీనామా

బెంగాల్‌ గవర్నరు రాజీనామా

- Advertisement -

ఎన్నికల వేళ అనూహ్య పరిణామం
కొల్‌కతా : పశ్చిమ బెంగాల్‌ రాష్ట్ర గవర్నరు సివి ఆనంద బోస్‌ తన పదవికి గురువారం నాడు రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపించారు. బెంగాల్‌ శాసనసభ ఎన్నికల ముందు అనూహ్యంగా చోటుచేసుకున్న ఈ పరిణామం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. బెంగాల్‌ గవర్నర్‌గా ఆయన మూడున్నరేళ్లు పనిచేశారు. అయితే, రాజీనామాకు గల కారణాలు మాత్రం ఆయన తెలపలేదు. బెంగాల్‌ కొత్త గవర్నర్‌గా తమిళనాడు గవర్నర్‌ రవిని కేంద్రం నియమించింది.

అయితే వ్యక్తిగత నిర్ణయంతోనే తాను రాజీనామా చేసినట్టు ఆనంద బోస్‌ చెప్పుకొచ్చారు. గవర్నర్‌ కార్యాలయంలో తాను తగినంత సమయం గడిపానని.. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానంటూ మీడియాకు తెలిపారు. 2022లో గవర్నర్‌గా ఆనంద బోస్‌.. బాధ్యతలు చేపట్టిన సంగతి తెలిసిందే. కాగా ఆనంద బోస్‌ రాజీనామా తనను షాక్‌కు గురి చేసిందని రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ట్వీట్‌ చేశారు. ఆయన రాజీనామా వెనుక గల కారణాలు ప్రస్తుతానికి తనకు తెలియవన్నారు. ఆర్‌ఎన్‌ రవిని పశ్చిమ బెంగాల్‌ గవర్నర్‌గా నియమిస్తున్నట్లు కేంద్ర హోంమంత్రి తనకు ఇప్పుడే తెలియజేశారంటూ గురువారం సాయంత్రం ఆమె పేర్కొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -