- Advertisement -
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణా సంస్థని ఒక పరిశోధనాత్మక అత్యున్నత విద్యా సంస్థగా తీర్చిదిద్దాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ (టీడీఎప్) డిమాండ్ చేసింది. ఈ మేరకు డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం.సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.లింగారెడ్డిలు సీఎం, సీఎస్, విద్యాశాఖ కార్యదర్శికి వినతిపత్రాలను అందజేశారు. పాఠశాల విద్యా నాణ్యత అనేది ఎస్సీఈఆర్టీ విద్యాపరమైన విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుందని తెలిపారు. అలాంటి సంస్థ డైరెక్టర్ పదవిలో కేవలం డిగ్రీ, బీఈడీ అర్హత ఉన్న అధికారులను నియమించడాన్ని వారు తప్పుపట్టారు. ఈ నిబంధనలను తక్షణమే సవరించాలని కోరారు.
- Advertisement -



