Saturday, March 7, 2026
E-PAPER
Homeసినిమాఅచ్చియమ్మ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌

అచ్చియమ్మ స్పెషల్‌ సర్‌ప్రైజ్‌

- Advertisement -

హీరో రామ్‌ చరణ్‌, దర్శకుడు బుచ్చి బాబు సానా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్‌-ఇండియా యాక్షన్‌ డ్రామా చిత్రం ‘పెద్ది’. ప్రస్తుతం పోస్ట్‌-ప్రొడక్షన్‌, ప్రమోషనల్‌ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. వృద్ధి సినిమాస్‌ బ్యానర్‌పై వెంకట సతీష్‌ కిలారు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్‌ 30న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో రామ్‌ చరణ్‌ సరసన హీరోయిన్‌గా నటిస్తున్న జాన్వీ కపూర్‌ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్‌ ఒక ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేశారు. అచ్చియమ్మ అనే పల్లెటూరి అమ్మాయిగా జాన్వీ కనిపించనున్నారు. ఇదే సందర్భంగా చిత్రబృందం జాన్వీ కపూర్‌కు స్పెషల్‌ బర్త్‌డే ట్రిబ్యూట్‌ వీడియోను కూడా విడుదల చేసింది. ఇందులో ఆమె ఆన్‌స్క్రీన్‌ ఎలిగెన్స్‌తో పాటు ఆఫ్‌స్క్రీన్‌ చార్మ్‌ను చూపించే బీహైండ్‌ ది సీన్స్‌ మూమెంట్స్‌ ఉన్నాయి.

వీడియోలో జాన్వీ సంప్రదాయ లుక్స్‌లో మెగాఫోన్‌ పట్టుకుని, వింటేజ్‌ మైక్‌ ముందు పాట పాడుతున్నట్లు కనిపిస్తారు. అలాగే దర్శకుడు బుచ్చి బాబు, హీరో రామ్‌ చరణ్‌తో ఆమె మాట్లాడుతున్న మూమెంట్స్‌ ఆకట్టుకున్నాయి. ఏఆర్‌ రెహమాన్‌ సౌండ్‌ట్రాక్‌ ఇప్పటికే సంచలనాన్ని సృష్టించింది. ‘చికిరి చికిరి, రైరై రా రా’ పాటలు వరల్డ్‌ వైడ్‌ వైరల్‌ అయ్యాయి అని చిత్రయూనిట్‌ తెలిపింది. శివ రాజ్‌ కుమార్‌, జగపతి బాబు, దివ్యేందు శర్మ, బొమన్‌ ఇరానీ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సమర్పకులు: మైత్రి మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌, సహ నిర్మాత: ఇషాన్‌ సక్సేనా, సంగీతం: ఏఆర్‌ రెహమాన్‌, డీఓపీ : ఆర్‌ రత్నవేలు, ప్రొడక్షన్‌ డిజైన్‌: అవినాష్‌ కొల్లా, ఎడిటర్‌: నవీన్‌ నూలి, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: వి.వై.ప్రవీణ్‌ కుమార్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -