Saturday, March 7, 2026
E-PAPER
Homeఆటలుభారత్‌ 198 ఆలౌట్‌

భారత్‌ 198 ఆలౌట్‌

- Advertisement -

ఆసీస్‌ మహిళలతో ఏకైక టెస్టు
పెర్త్‌ (ఆస్ట్రేలియా) :
భారత్‌, ఆస్ట్రేలియా మహిళల ఏకైక టెస్టు తొలి రోజు వికెట్ల జాతర సాగింది. తొలి రోజు ఆటలోనే భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో కుప్పకూలగా.. ఆతిథ్య ఆస్ట్రేలియా 3 వికెట్లు కోల్పోయింది. ఆసీస్‌ ఆల్‌రౌండర్‌ అనాబెల్‌ సుథర్‌లాండ్‌ (4/46), లూసీ హామిల్టన్‌ (3/31), డార్సీ బ్రౌనీ (2/41) నిప్పులు చెరగటంతో భారత్‌ తొలి ఇన్నింగ్స్‌లో 62.4 ఓవర్ల్లలో 198 పరుగులకే కుప్పకూలింది. జెమీమా రొడ్రిగ్స్‌ (52, 84 బంతుల్లో 7 ఫోర్లు) అర్థ సెంచరీతో రాణించగా, షెఫాలీ వర్మ (35, 48 బంతుల్లో 6 ఫోర్లు), కాశ్వీ గౌతమ్‌ (34 నాటౌట్‌, 54 బంతుల్లో 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించారు. స్మృతీ మంధాన (4), ప్రతీకా రావల్‌ (18), హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (19), దీప్తి శర్మ (7), రిచా ఘోష్‌ (11), స్నేహ్ రానా (5) నిరాశపరిచారు. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 27 ఓవర్లలో 3 వికెట్లు 96 పరుగులతో ఆడుతోంది. జార్జియా వోల్‌ (2), లిచ్‌ఫీల్డ్‌ (9), అలీసా హీలీ (13) అవుటైనా.. ఎలిసీ పెర్రీ (43 నాటౌట్‌), అనాబెల్‌ సుథర్‌లాండ్‌ (20 నాటౌట్‌) అజేయంగా ఆడుతున్నారు. తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్‌ మరో 102 పరుగుల వెనుకంజలో నిలిచింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -