నవతెలంగాణ-బేగంపేట్
హైదరాబాద్ బేగంపేటలోని భారత వాతావరణ కేంద్రానికి(ఐఎండీ) బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో అధికారులు, పోలీసులు అప్రమత్తమయ్యారు. అజత్ కుటుంబా పేరిట శుక్రవారం ఉదయం 6.30 గంటలకు ఐఎండీ అధికారిక మెయిల్‌కు సందేశం వచ్చింది. కేంద్రంలో 14 ఐఈడీ బాంబులు అమర్చినట్టు, ఉదయం 11 గంటలలోపు సిబ్బంది ఖాళీ చేయాలని మెయిల్‌లో పేర్కొన్నారు. ఉదయం 10.30 గంటల సమయంలో మెయిల్స్ పరిశీలించిన ఐఎండీ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బేగంపేట ఏసీపీ గోపాలకృష్ణమూర్తి ఆధ్వర్యంలో బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్ సహాయంతో కేంద్రం, పరిసర ప్రాంతాల్లో మూడు గంటలపాటు తనిఖీలు నిర్వహించారు. మధ్యాహ్నం 1.30 గంటలకు తనిఖీలు పూర్తిచేసిన పోలీసులు ఎలాంటి బాంబులు లేవని నిర్ధారించారు. దాంతో అధికారులు, సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు.
వాతావరణ కేంద్రానికి బాంబు బెదిరింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



