నవతెలంగాణ- కాటారం
కాటారం మండలం గంగారం గ్రామ పంచాయతీలో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా శనివారం పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలను శుభ్రపరిచే కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలో విద్యార్థులు, చిన్నారులు పరిశుభ్రమైన వాతావరణంలో చదువుకునేలా ప్రత్యేకంగా శుభ్రత చర్యలు చేపట్టారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బండం శోభరాణి ఆధ్వర్యంలో ఉపసర్పంచ్ ములకళ్ల నగేష్, వార్డు సభ్యుడు మహేందర్, పంచాయతీ కార్యదర్శి బీరెల్లి కరుణాకర్ పాల్గొని పాఠశాలలు, అంగన్వాడీ భవనాలు, ప్రాంగణాలను శుభ్రపరిచారు. గ్రామంలో పరిశుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, పిల్లల ఆరోగ్యాన్ని కాపాడేందుకు అందరూ సహకరించాలని వారు సూచించారు.
ప్రజా పాలన–ప్రగతి ప్రణాళిక ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులతో పాటు పరిశుభ్రత కార్యక్రమాలు కూడా చేపడుతూ ప్రజల్లో అవగాహన పెంపొందిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజలు కూడా పాల్గొని శుభ్రత కార్యక్రమానికి సహకరించారు.



