Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజాపాలనలో భాగస్వాములు కావాలి 

ప్రజాపాలనలో భాగస్వాములు కావాలి 

- Advertisement -

బీర్కూర్ ఎంపీడీవో శ్రీనిధి 
నవతెలంగాణ – బీర్కూర్ (నరసరుల్లాబాద్) 

అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజాపాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు భాగస్వాములు కావాలని బీర్కూర్ ఎంపీడీవో శ్రీనిధి అన్నారు. శనివారం మండలంలోని అన్నారం గ్రామంలో ప్రజా పాలన-ప్రగతి ప్రణాళిక అనే కార్యక్రమంలో భాగంగా అంగన్వాడి సెంటర్ ను తనిఖీ చేశారు.

అలాగే గ్రామపంచాయతీ కార్యాలయం సందర్శించారు,  అన్నారం గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. గ్రామస్థాయి ప్రజాప్రతినిధులతో గ్రామస్థాయి అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో శ్రీనిధి మాట్లాడుతూ ప్రజా పాలన- ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు, పెండింగ్‌ ఫైళ్ల పరిష్కారం, వైద్యారోగ్య సేవల విస్తరణ,కోతులు, వీధికుక్కల సమస్యలను నియంత్రించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు.

వ్యవసాయశాఖ ద్వారా రైతులకు యూరియా ఎరువుల సమర్ధ వినియోగంపై అవగాహన కల్పించాలని సూచించారు. మండల పరిధి అధికారులు గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యులు ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషిచేయాలని సూచించారు. ఈ  కార్యక్రమంలో ఎంపీఓ మహబూబ్ సూపర్ డెంట్ భాను ప్రకాష్ గ్రామ కార్యదర్శి మోహన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -