నవతెలంగాణ – జుక్కల్
జుక్కల్ మండలంలోని పలు గ్రామాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉపాధ్యాయునీలను ఉపాధ్యాయుల బృందం శనివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బస్వాపూర్ గ్రామంలోని ఎంపియుపిఎస్ పాఠశాలకు చెందిన ముగ్గురు ఉపాధ్యాయినీలను శాలువాతో సన్మానించి జ్ఞాపికలను అందించారు.
అదేవిధంగా పెద్దగుళ్ల గ్రామంలోని ఎంపియుపిఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయిని చంద్రకళను, గుల్లా తాండ సిపిఎస్ పాఠశాల హెచ్ఎం అఖిల, చండే గావ్ ఎంపీపీ ఎస్ హెచ్ఎం మౌనిక, హంగర్గా ఎంపీపీ ఎస్ఎంఎస్ స్వరూప, కత్తల్ వాడి హెచ్ఎం జ్యోతి, చిన్న ఏడ్గి హెచ్ఎం భారతి , జుక్కల్ ఎంపియుపిఎస్హెచ్ఎం అంజలి, జుక్కల్ జెడ్పీహెచ్ఎస్ టీచర్ స్వర్ణలత, జుక్కల్ ఎస్సీ కాలనీ హెచ్ఎం అఖిల, పెద్దగుల్ల ఉర్దూ మీడియం హెచ్ఎం సబీనా బేగం, గుండూర్ హెచ్ఎం భారతి, సాగర్ గావ్ తండా హెచ్ఎం రేచల్ రాణి, లొంగన్ తండా హెచ్ఎం మౌనిక, శక్తీనగర్ హెచ్ ఎం విజయలక్ష్మి, , మైబాబు హెచ్ఎం లక్ష్మి , మైలార్ హెచ్ఎం, కేమ్రాజ్ కల్లాలి ఎంపియుపిఎస్ టీచర్, మహమ్మదాబాద్ తాండ టీచర్, తాహసిల్దార్ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న నయాబ్ తాహసిల్దార్ హేమలత , నాగల్ గావ్ టీచర్, లొంగన్ ఎంపిపిఎస్ టీచర్ , ఖండేబల్లూర్ జడ్పిహెచ్ఎస్ టీచర్, కౌలాస్ ఎస్పి హాస్టల్ వార్డేన్ శాంతి, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విధులు నిర్వహిస్తున్న మహిళా టీచర్లు, ఎంపీడీవో కార్యాలయంలోని విధులు నిర్వహిస్తున్న జూనియర్ అసిస్టెంట్, ప్రభుత్వ ఆసుపత్రిలోని విధులు నిర్వహిస్తున్న ఏఎన్ఎంలు, నర్సులు , వివిధ విభాగాల అధికారినిలుకు సంబంధించిన శాఖలో ఉన్నతాధికారులు సన్మానించారు.



