Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శిక్షణా తరగతులకు వార్డు మెంబర్లు విధిగా హజరవ్వాలి: ఎంపీడీవో

శిక్షణా తరగతులకు వార్డు మెంబర్లు విధిగా హజరవ్వాలి: ఎంపీడీవో

- Advertisement -

నవతెలంగాణ – జుక్కల్
ఈ నెల 9 నుంచి 13 వరకు మొదటి విడతగా 5 రోజుల పాటు వార్డు మెంబర్ల శిక్షణా తరగతులు జరగనున్నాయని శనివారం జుక్కల్ ఎంపీడీఓ శ్రీనివాస్ తెలిపారు. క్లాసులు ఉదయము 9:00 గంటలకు మొదలవుతాయని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ శిక్షణా తరగతులకు వార్డు మెంబర్లు అందరూ తప్పక హాజరు కావాలని సూచించారు. ఒకవేళ ఎవరైనా (వార్డు మెంబర్లు) కాకపోతే సంబంధిత కార్యదర్శులదే భాద్యత అని తెలిపారు. ఈ కార్యక్రమమానికి సీఈఓ జడ్పీ, డిపిఓ, డిఎల్పిఓ  హాజరవుతారని వెల్లడించారు. కావున విధిగా అందరూ తప్పక హాజరవ్వాలని తెలిపారు. క్లాసులకు హాజరు కానివారిపై, వారి భాద్యులపై జిల్లా కలెక్టర్ సీరియస్ గా చర్యలు తీసుకునేందుకు ఉత్తర్వులు జారీ చేశారని అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -