Sunday, March 8, 2026
E-PAPER
Homeతాజా వార్తలుఎన్టీఆర్ అవార్డు అందుకోవడం గొప్ప గౌరవం: చిరంజీవి

ఎన్టీఆర్ అవార్డు అందుకోవడం గొప్ప గౌరవం: చిరంజీవి

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన ప్రతిష్ఠాత్మక ‘గద్దర్ చలనచిత్ర అవార్డులు-2025’లో తనకు ఎన్టీఆర్ జాతీయ పురస్కారం దక్కడంపై మెగాస్టార్ చిరంజీవి సంతోషం వ్యక్తం చేశారు. ఎన్టీఆర్ గారి పేరు మీదుగా ఉన్న అవార్డును అందుకోవడం తనకు దక్కిన గొప్ప గౌరవంగా భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఈ మేరకు ‘ఎక్స్’ వేదికగా చిరంజీవి స్పందిస్తూ.. “గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డుల విజేతలందరికీ హృదయపూర్వక అభినందనలు. సినీ పరిశ్రమలో ప్రతిభను, కష్టాన్ని గుర్తించి గౌరవించడం ఎప్పుడూ ఆనందాన్నిస్తుంది. నన్ను ఎన్టీఆర్ జాతీయ అవార్డుకు ఎంపిక చేసినందుకు తెలంగాణ ప్రభుత్వానికి, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, జ్యూరీ సభ్యులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు. నా ఈ ప్రయాణంలో ప్రేక్షకుల ప్రేమాభిమానాలే నాకు కొండంత బలం” అని రాసుకొచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -