Sunday, March 8, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఉపాధ్యాయుడు నరేష్ కు ఘన వీడ్కోలు

ఉపాధ్యాయుడు నరేష్ కు ఘన వీడ్కోలు

- Advertisement -

నవతెలంగాణ – రాయపోల్
రాయపోల్ మండలం వడ్డేపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులుగా విధులు నిర్వహిస్తున్న గౌలికర్ నరేష్‌ గ్రూప్ -3 ఉద్యోగం సాధించి పదోన్నతి పై పాఠశాల నుంచి బదిలీ కావడంతో ఆత్మీయ అభినందన సమావేశం నిర్వహించి ఘనంగా వీడ్కోలు పలకడం జరిగిందని గ్రామ సర్పంచ్ రేణుక రాజ్ గౌడ్, ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.

శనివారం పాఠశాలలో ఉపాధ్యాయుల నరేష్ కు ఆత్మీయ వేడుకలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వడ్డేపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యాబోధన చేస్తున్న గౌలికర్ నరేష్ గత కొన్ని సంవత్సరాలుగా గ్రూప్ పరీక్షలు రాస్తూ 2024 సంవత్సరంలో ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ పరీక్షలలో ఉత్తీర్ణత సాధించి రాష్ట్ర విద్యాశాఖ కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్ పదవిని సంపాదించారు. ఆ పదవి బాధ్యతలు చేపట్టడానికి వడ్డేపల్లి ప్రాథమిక పాఠశాల నుంచి పదోన్నతి పై బదిలీ వెళుతున్నారు. గత రెండు సంవత్సరాలుగా వడ్డేపల్లి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల అభివృద్ధికి ఆయన చేసిన కృషి ప్రశంసనీయమని పేర్కొన్నారు.

భవిష్యత్తులో ఆయన మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ వడ్డేపల్లి పాఠశాలలో ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు సాజిద్, జినాద్, మాధురి, స్వప్న, సీఆర్పీ యాదగిరి, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -