Monday, July 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ డీఎంకు సర్పంచుల వినతి

బస్సు సౌకర్యం కల్పించాలని ఆర్టీసీ డీఎంకు సర్పంచుల వినతి

- Advertisement -

నవతెలంగాణ-నెల్లికుదురు
తొర్రూర్ నుండి ఎర్రబెల్లి గూడెం మీదుగా పార్వతగిరి వరకు, ఎర్రబెల్లి గూడెం నుండి నెల్లికుదురు మోడల్ స్కూల్ వరకు బస్సు సౌకర్యం కల్పించాలని ఎర్రబెల్లి గూడెం గ్రామ సర్పంచ్ గుండెబోయిన ఉష అశోక్ యాదవ్, కాచికల్ గ్రామ సర్పంచ్ ఇట్టే లీల దేవేందర్ రెడ్డి, సౌల తండా సర్పంచ్ సుజాత వాసు నాయక్, బడి తండా గ్రామ సర్పంచ్ బిలావత్ ధనమ్మ అమృనాయక్ సోమవారం డిఎం కు వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉన్న జనాభా, విద్య, వైద్య పరంగా మరియు రైతు సరుకులు తీసుకోవడానికి ఈ గ్రామాల మీదుగా బస్సు సౌకర్యం లేకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని తెలిపారు.

ఈ ప్రాంతంలో అనేకమంది పేద పిల్లలు మోడల్ ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేందుకు వెళ్లడానికి బస్సు సౌకర్యం లేక అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర వైద్య సేవల నిమిత్తం ఏరియా ఆస్పత్రికి వెళ్లాలన్న బస్సు సౌకర్యం లేదనీ, ఒకానొక సందర్భంలో ప్రాణలు కూడా పోయే పరిస్థితులు కూడా నెలకొన్నాయని, రైతన్న పంటలు సాగుచేసేందుకు యూరియా, సంబంధిత మందులు తేలేక అన్నదాతలు పడే బాధ వార్ణణాతీతమన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకుని, నా ప్రాంతానికి బస్సు సౌకర్యం కల్పించాలని వేడుకున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -