- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : జాగింగ్ చేస్తున్న హెడ్ కానిస్టేబుల్‌ను గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన కర్నూలు నగరంలో చోటుచేసుకుంది. ఏపీఎస్పీ రెండో బెటాలియన్ హెడ్ కానిస్టేబుల్ వరప్రసాద్ రెడ్డి తెల్లవారుజామున బళ్లారి చౌరస్తా వద్ద ఉన్న జాతీయ రహదారిపై జాగింగ్ చేస్తున్నారు. ఈ సమయంలో అటుగా వెళుతున్న గుర్తు తెలియని వాహనం కానిస్టేబుల్ ను ఢీకొంది. దీంతో వరప్రసాద్ రెడ్డి ఫ్లైఓవర్‌పై నుంచి కిందపడి అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనపై ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -



