Tuesday, March 10, 2026
E-PAPER
Homeఆటలుస్టేడియాలకు ఆధునిక సొబగులు!

స్టేడియాలకు ఆధునిక సొబగులు!

- Advertisement -

క్రీడాశాఖపై సమీక్షలో సీఎం రేవంత్‌ రెడ్డి
నవతెలంగాణ-హైదరాబాద్‌
: తెలంగాణ నుంచి ఒలింపిక్‌ పతక విజేతలను తయారు చేయడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తోంది. అందుకు, హైదరాబాద్‌లోని స్టేడియాలను ప్రపంచ శ్రేణి ప్రమాణాలతో ఆధునీకరించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్బీ స్టేడియం, సరూర్‌ నగర్‌ స్టేడియం, యూసుఫ్‌గూడ స్టేడియాలను భవిష్యత్‌ అవసరాలు, శిక్షణ, పోటీల నిర్వహణకు అనుగుణంగా ఆధునీకరించాలని సోమవారం తన నివాసంలో క్రీడాశాఖపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీఎం మార్గదర్శనం చేశారు. గచ్చిబౌలి అవుట్‌డోర్‌ స్టేడియం నవీనీకరణతో పాటు ఇండోర్‌ స్టేడియం, యూనివర్శిటీ కాంప్లెక్స్‌, హాస్టల్‌ భవనాలు, క్రీడా మైదానాలు, శిక్షణకు అవసరమైన మౌలిక సదుపాయాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు. పలు నిర్మాణాలకు సంబంధించిన డిజైన్లను సమావేశంలో ప్రదర్శించగా..ఒలింపిక్స్‌, కామన్‌వెల్త్‌ క్రీడలకు ఆతిథ్యం ఇచ్చేందుకు అనువుగా నిర్మాణ ప్రణాళికలు ఉండాలని సీఎం సూచనలు చేశారు. అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్శిటీలో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని, యూనివర్శిటీలో అకాడమీలు, క్రీడా మైదానాల ఏర్పాటుపై సమావేశంలో చర్చించారు. క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, స్పోర్ట్స్‌ చైర్మన్‌ శివసేనా రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీఎం ప్రిన్సిపల్‌ సెక్రటరీలు శ్రీనివాస రాజు, శేషాద్రి, శాట్జ్‌ ఎండీ సోనీబాలా దేవి, యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ యూనివర్శిటీ వీసీ డా. జి కిషోర్‌, ఉన్నతాధికారులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -