Wednesday, July 15, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంఇరాన్ యుద్ధంలో 14 మంది అమెరికా సైనికుల మృతి

ఇరాన్ యుద్ధంలో 14 మంది అమెరికా సైనికుల మృతి

- Advertisement -

400 
మందికి పైగా గాయాలు
వాషింగ్టన్ :
ఇరాన్‌పై సాగిస్తున్న యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమెరికా సైనికుల సంఖ్య 14కు చేరింది. తాజాగా…ఈ నెలలో అరేబియా సముద్రంలో హెలికాప్టర్ కూలిన ఘటనలో నౌకాదళ పైలట్ చనిపోయాడు. పోరులో గాయపడిన అమెరికా సైనికుల సంఖ్య సోమవారం నాటికి 400 దాటింది. వీరిలో ఎక్కువ మందికి తీవ్రమైన మెదడు గాయాలు అయ్యాయని అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ చెప్పారు. ముందుగా కువైట్‌లోని కమాండ్ కేంద్రంపై జరిగిన ఇరాన్ డ్రోన్ దాడిలో ఆరుగురు సైనికులు చనిపోయారు. ఆ తర్వాత సౌదీ అరేబియాలోని ప్రిన్స్ సుల్తాన్ వైమానిక స్థావరంపై జరిగిన దాడిలో ఓ సైనికుడు మరణించాడు. ఇరాన్‌కు వ్యతిరేకంగా అమెరికా సైనిక చర్యకు సహకరిస్తున్న కేసీ`135 రీఫ్యూయలింగ్ విమానం ఇరాక్‌లో కూలిన ఘటనలో మరో ఆరుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు. మొత్తంగా ఇరాన్ యుద్ధంలో 413 మంది సైనికులు గాయాలపాలయ్యారు. అయితే వారిలో దాదాపుగా అందరూ తిరిగి విధులలో చేరారని సైనిక కమాండ్ ప్రతినిధి మేజర్ ఎమ్మా థాంప్సన్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -