Tuesday, March 10, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం

గాలికుంటు నివారణ టీకాల కార్యక్రమం

- Advertisement -

నవతెలంగాణ-కమ్మర్ పల్లి 
మండల కేంద్రంలో మంగళవారం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గాలికుంటు నివారణ టీకాల శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉప సర్పంచ్ కొత్తపల్లి అశోక్ ముఖ్యఅతిథిగా పాల్గొని  ప్రారంభించారు .ఈ కార్యక్రమంలో 37 గోజాతి, 186 గేదేజాతి పశువులకు ఉచితంగా గాలికుంటు నివారణ టీకాలు వేసినట్లు మండల పశు వైద్యాధికారి డాక్టర్ రాజశేఖర్ రావు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి పశువుకు తప్పకుండా టీకా వేయించుకోవాలని, ప్రతి ఆరు నెలలకు ఒకసారి గాలికుంటు నివారణ టీకాలు వేయించుకోవాలని సూచించారు. జీవాలు గాలికుంటు వ్యాధి బారిన పడడం వల్ల నోటిలో పుల్లతో చొంగ కారడం, కాలి డెక్కలలో పగుళ్లు ఏర్పడి నడవలేకపోవడం, పాల ఉత్పత్తి తగ్గిపోవడం, చూడి పశువులు అబార్షన్లు అవడం వంటి లక్షణాలు ఏర్పడతాయని వివరించారు. రైతులు ముందు జాగ్రత్త కొరకు తప్పకుండా తమ పశువులకు గాలికుంటు నివారణ టీకాలు చేయించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతులు,  పశు వైద్య సిబ్బంది వెటర్నరీ సీనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ రెడ్డి, గోపాలమిత్ర స్పరన్, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -