Wednesday, July 15, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం20న క్యూర్ ఎల్‌ఐజీ 
ఇండ్లకు శ్రీకారం

20న క్యూర్ ఎల్‌ఐజీ 
ఇండ్లకు శ్రీకారం

- Advertisement -

దశలవారీగా లక్ష ఇందిరమ్మ గృహాల నిర్మాణం
పైలట్‌‌గా నియోజకవర్గానికి వెయ్యి : మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్‌

గ్రామీణ ప్రాంతాల్లో ఇందిరమ్మ ఇండ్లతో పెద కుటుంబాల సొంతింటి కలను సాకారం చేస్తున్న ప్రజా ప్రభుత్వం, ఇప్పుడు అదే సంకల్పంతో క్యూర్ పరిధిలో మరో చారిత్రాత్మక అడుగు వేస్తున్నదని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార, పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనలకు అనుగుణంగా క్యూర్ పరిధిలో దశల వారీగా లక్ష ఎల్‌ఐజీ ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నట్టు అన్నారు. ఇందుకు సంబంధించి ఇప్పటికే పరిపాలన అనుమతులు సైతం ఇవ్వడం జరిగిందని వివరించారు. మంగళవారం సచివాలయంలోని తన చాంబర్‌‌లో ఎల్‌ఐజీ ఇందిరమ్మ ఇండ్ల పై హౌసింగ్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ నెల 20వ తేదీన క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇండ్ల పథకానికి శ్రీకారం చుడుతున్నామని ప్రకటించారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఇన్‌చార్జి మంత్రులు పొన్నం ప్రభాకర్, దుద్దిళ్ల శ్రీధర్ బాబు, హైదరాబాద్ జిల్లా మంత్రి మహ్మద్ అజారుద్దీన్‌తో కలిసి పథకానికి సంబంధించిన విధివిధానాలు , దరఖాస్తుల ఆహ్వానం, అర్హతలు, టెండర్ల ప్రక్రియ, అమలు విధానం తదితర పూర్తి మార్గదర్శకాలను ప్రకటిస్తామని వివరించారు.2026-27 ఆర్థిక సంవత్సరంలో క్యూర్ పరిధిలో లక్ష ఇందిరమ్మ ఎల్‌ఐజీ ఇండ్ల నిర్మాణానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. తొలి దశలో పైలట్ ప్రాజెక్టుగా ప్రతి నియోజకవర్గానికి కనీసం 500 చొప్పున, ఆయా స్థానిక పరిస్థితులనుబట్టి అవసరమైన చోట వెయ్యి వరకు నిర్మిస్తామన్నారు. క్యూర్ పరిధిలోని హైదరాబాద్, సైబరాబాద్, మేడ్చల్ మల్కాజ్ గిరి మున్సిపల్ కార్పొరేషన్ నియోజకవర్గాలల్లో స్థలాలను గుర్తించడం జరిగిందన్నారు. ఈ స్థలాలను ఇప్పటికే హౌసింగ్ విభాగం పొజిషన్ లోకి తీసుకుందనీ, ఎక్కడ ఎన్ని ఇండ్లు, ఎన్ని అంతస్తులు నిర్మించాలి, ఒక్కో ప్లాట్ విస్తీర్ణం, బిల్డింగ్ డిజైన్లను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించి రెండు, మూడు రోజుల్లో తుది రూపును ఇస్తామని వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -