- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్ : మార్కెట్‌లో కోడిగుడ్ల ధరలు విపరీతంగా పెరిగి సామాన్యుడికి భారంగా మారాయి. రిటైల్ మార్కెట్లో ఒక్కో కోడిగుడ్డు ధర రికార్డు స్థాయిలో రూ.8 నుండి రూ.9కి చేరింది. పౌల్ట్రీ రంగంలో ఉత్పత్తి వ్యయం పెరగడమే దీనికి ప్రధాన కారణం. కోళ్ల దాణా అయిన సోయాబీన్ ధర కేజీ రూ.35 నుండి రూ.68కి, మొక్కజొన్న క్వింటాల్ ధర రూ.20 నుండి రూ.28కి పెరిగింది. గుడ్ల ధరల ప్రభావం చికెన్‌పై కూడా పడింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో లైవ్ చికెన్ కిలో రూ.290, స్కిన్‌లెస్ చికెన్ ధర రూ.320 వరకు పలుకుతోంది. సాధారణంగా శీతాకాలంలో పెరిగే ధరలు, ఈసారి వర్షాకాలంలోనే భారీగా పెరగడం గమనార్హం.
- Advertisement -



