No menu items!
Monday, August 25, 2025
E-PAPER
spot_img
No menu items!
Homeరాష్ట్రీయంబొగ్గు నాణ్యతా ప్రమాణాలు పెంచండి

బొగ్గు నాణ్యతా ప్రమాణాలు పెంచండి

- Advertisement -

– పని సంస్కృతిలో మార్పుకోసం కార్మిక సంఘాల సహకారం తీసుకోవాలి : కోలిండియా, సింగరేణిపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సమీక్ష
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

ఇంథన రంగంలో స్వయం సమృద్ధిని సాధించేందుకు డిమాండ్‌కు తగినట్టు నాణ్యమైన బొగ్గును ఉత్పత్తి చేయాలని కేంద్ర బొగ్గు మంత్రిత్వశాఖ మంత్రి జీ కిషన్‌రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. గురువారంనాడాయన బొగ్గుశాఖ కార్యదర్శి విక్రమ్‌దేవ్‌దత్‌తో కలిసి ఢిల్లీ నుంచి కోల్‌ ఇండియా, సింగరేణి సంస్థలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. బొగ్గు ఉత్పత్తి వ్యయం తగ్గింపు, నాణ్యత, సరఫరా తదితర అంశాల్లో ఎదురవుతున్న సవాళ్లు, వాటిపై తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. కార్మికుల జీతాలు, సంక్షేమ కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పని సంస్కృతిలో మార్పుల కోసం కార్మిక సంఘాల సహకారాన్ని తీసుకోవాలని సూచించారు. ఉత్పత్తి ఖర్చు తగ్గింపుపై సింగరేణి, బొగ్గు మంత్రిత్వ శాఖ నిపుణులతో ఒక కమిటీని ఏర్పాటు చేయాలన్నారు. ఈ కమిటీ ప్రత్యక్షంగా క్షేత్రస్థాయి పరిశీలన జరిపి, ఆచరణాత్మక సూచనలను చేస్తుందన్నారు. వినియోగదారులు సింగరేణి సంస్థకు దూరం కాకుండా ఉండాలంటే నాణ్యతపై దృష్టి పెట్టాలన్నారు. సమావేశంలో సింగరేణి సీఎమ్‌డీ ఎన్‌ బలరాం పవర్‌పాయింట్‌ ప్రెజెంటేషన్‌ ద్వారా సంస్థ కార్యకలాపాలను వివరించారు. డైరెక్టర్లు డీ సత్యనారాయణరావు, ఎల్వీ సూర్యనారాయణరావు, కే వెంకటేశ్వర్లు, ఈడీ ఎస్డీఎం సుభాని తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad