కేంద్ర మంత్రివర్గం ఆమోదం
అంతర్జాతీయ విమానాశ్రయంగా మదురై ఎయిర్‌పోర్టు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
2028 డిసెంబర్ వరుకు జల్ జీవన్ మిషన్ (జేజేఎం) పొడిగిస్తూ కేంద్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మంగళవారం ప్రధాని మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో మౌలిక సదుపాయాల కల్పనకు రూ.8.8 లక్షల కోట్లు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇక జల్ జీవన్ మిషన్ పొడింపు కోసం మరో రూ.8.69 లక్షల కోట్లను కేటాయించింది. మదుురై ఎయిర్‌పోర్టును అంతర్జాతీయ విమానాశ్రయంగా ప్రకటించింది.
పశ్చిమ బెంగాల్-జార్ఖండ్ మధ్య రూ.4,474 కోట్లతో 192 కిలోమీటర్ల మేర మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రూ.3,839. 42 కోట్లతో మధ్యప్రదేశ్ లోని ఢిల్లీ-ముంబయి ఎక్స్ ప్రెస్ వే బద్నావర్-థాండియా-తిమర్వానీ మధ్య ఐదు లైన్ల రహదారి నిర్మాణానికి కేంద్రం ఆమోదం తెలిపింది. రూ.3,631 కోట్లతో జెవార్ విమానాశ్రయం-ఫరీదాబాద్ సెక్షన్‌ను కలిపే ఆరు లైన్ల ఎలివేటెడ్ రోడ్డు నిర్మాణానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది.



