కేంద్ర మంత్రులకు పొన్నం బహిరంగ లేఖ
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చిన హామీలు అమలు చేయడంలో కేంద్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. మంగళవారం కేంద్ర మంత్రులు జి కిషన్‌రెడ్డి, బండి సంజయ్ కి బహిరంగ లేఖ రాశారు. ఆ కాపీని మీడియాకు విడుదల చేశారు. కేంద్రం నుంచి వచ్చే నిధులు దయ కాదనీ, తెలంగాణ హక్కు అని చెప్పారు.
తెలంగాణ ప్రజలు పన్నులు చెల్లిస్తున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల అభివృద్ధి కోసం ఎందుకు చర్యలు చేపట్టడం లేదని ప్రశ్నించారు. పార్లమెంట్లో జరుగుతున్న కేంద్ర బడ్జెట్ చర్చలో తెలంగాణకి సంబంధించిన రావాల్సిన నిధులు, పెండింగ్ ప్రాజెక్ట్‌లపై కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్‌రెడ్డి చర్చించాలని సూచించారు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రతి బడ్జెట్లో భారీగా నిధులు కేటాయిస్తున్నారని గుర్తు చేశారు. మేము దానిని వ్యతిరేకించడం లేదనీ, అదే సందర్భంలో ఏపీకి కేటాయించే నిధుల్లో తెలంగాణకు సగం నిధులైన కేంద్రం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
హామీలు నెరవేర్చండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



