Wednesday, March 11, 2026
E-PAPER
Homeతాజా వార్తలుహైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..

హైదరాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం..

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్; హైదరాబాద్‌ పాతబస్తీ చార్మినార్‌ సమీపంలోని షహ్రాన్ మార్కెట్‌లో ఉన్న ఒక బుర్ఖా దుకాణంలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. మూడవ అంతస్తులో మినీ గ్యాస్ సిలిండర్ లీకేజీ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు సమాచారం. మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, వారిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -