నవతెలంగాణ – జుక్కల్
మండలంలోని పెద్ద ఏడ్గి గ్రామంలో గ్రామ సర్పంచ్ అస్పత్ వార్ అనిల్ కుమార్ ప్రజా పాలనలో భాగంగా బుధవారం ఏడవ రోజు నిర్వహించిన వాటర్ ట్యాంకుల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్మాట్లాడుతూ.. ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్‌ను పరిశీలించామిన తెలిపారు. ట్యాంక్ శుభ్రత, నీటి నిల్వ పరిస్థితి మరియు ప్రజలకు సరఫరా అవుతున్న తాగునీటి నాణ్యత గురించి తెలుసుకున్నామని అన్నారు.
ట్యాంక్ మూతను తెరిచి లోపలి భాగాన్ని శుభ్రత పరిస్థితి చేశామని తెలిపారు. గ్రామ ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందించేందుకు ట్యాంక్‌ను నిరంతరం శుభ్రంగా ఉంచాలని సంబంధిత సిబ్బందికి సూచించామని తెలిపారు. గ్రామాభివృద్ధి ద్యేయంగా ప్రతి ఒక్కరు బాధ్యతగా పనులు నిర్వహించాలని అన్నారు. గ్రామాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమంలో గ్రామస్తుల పాత్ర ప్రాముఖ్యత అత్యధికంగా ఉంటుందని తెలిపారు. గ్రామస్తులు సహకరించినప్పుడే గ్రామాన్ని అభివృద్ధి బాటలో నిలపగలుగుతామని ఆశ భావం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అస్పత్ వార్ అనీల్ కుమార్, వార్డ్ మెంబర్ శంకర్ పటేల్, గ్రామ కార్యదర్శి రమేష్, ఎఫ్ ఎ సుభాష్, వాటర్ మాన్ బాలు తదితరులు పాల్గొన్నారు.



