– బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
– సెయింట్ ఆన్స్ మహిళా కళాశాలలో ‘పార్లమెంట్’ కార్యక్రమం
నవతెలంగాణ- మెహిదిపట్నం
మహిళల్లో ప్రజాస్వామ్య రాజకీయ చైతన్యం పెరగాలని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ మెహిదీపట్నంలోని సెయింట్ ఆన్స్ మహిళా కళాశాలలో బుధవారం మహిళల నాయకత్వ నైపుణ్యాలను పెంపొందించేలా, పార్లమెంటరీ చర్చలను అనుకరిస్తూ ఇంటర్ కాలేజ్ యూత్ పార్లమెంట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. మహిళలు రాజకీయాల్లో ఉత్సాహంగా పాల్గొనాలని సూచించారు. యువతులు రాజకీయ చర్చల్లో చురుకుగా పాల్గొని నాయకత్వ పాత్రలు పోషించాలని అభిలాషించారు. దేశ ప్రజాస్వామ్య భవిష్యత్ మంచి విద్యాసంస్థల్లోని యువతుల ద్వారానే రూపుదిద్దుకుంటుందని చెప్పారు.ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించు కోవాలని విజ్ఞప్తి చేశారు. ఓటు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని మార్చగలిగే శక్తివంతమైన సాధనమని తెలిపారు. యూత్ పార్లమెంట్‌లో పాల్గొన్న విద్యార్థినులను అభినందించారు. అనంతరం పోటీల్లో గెలిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సి పాల్ విజయ రాణి, ఉపాధ్యాయులు, విద్యార్థినులు, సిబ్బంది పాల్గొన్నారు
మహిళల్లో ప్రజాస్వామ్య రాజకీయ చైతన్యం పెరగాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



