Saturday, July 18, 2026
E-PAPER
Homeమానవిహార్మోన్ల మార్పులను గమనించే స్మార్ట్ పరికరాలు

హార్మోన్ల మార్పులను గమనించే స్మార్ట్ పరికరాలు

- Advertisement -

మహిళల ఆరోగ్య సంరక్షణలో సాంకేతిక పరిజ్ఞానం వేగంగా మార్పులు తీసుకొస్తోంది. ఒకప్పుడు రుతుక్రమం తేదీలను క్యాలెండర్‌లో గుర్తు పెట్టుకోవడం లేదా మొబైల్ యాప్‌లో నమోదు చేయడానికే పరిమితమైన డిజిటల్ సాయం, ఇప్పుడు శరీరంలో జరిగే హార్మోన్ల మార్పులను అంచనా వేసే స్థాయికి చేరుతోంది. స్మార్ట్ వాచీలు, స్మార్ట్ ఉంగరాలు, చర్మానికి అమర్చే సూక్ష్మ సెన్సర్లు వంటి ధరించగలిగే పరికరాలు శరీరంలో జరిగే జీవక్రియ మార్పులను నిరంతరం నమోదు చేస్తూ, రుతుచక్రం, అండోత్సర్గం, మెనోపాజ్, హార్మోన్ల అసమతుల్యత వంటి అంశాలపై విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయి. ​రుతుక్రమం వెనుక ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరోన్ వంటి హార్మోన్లతో పాటు అండోత్సర్గాన్ని నియంత్రించే ఇతర హార్మోన్ల సమన్వయం ఉంటుంది. వీటిలో వచ్చే మార్పులతో శరీర ఉష్ణోగ్రత, గుండె స్పందన, నిద్ర, ఆకలి, మానసిక స్థితి, శక్తి స్థాయిల్లోనూ మార్పులు కనిపిస్తాయి. తాజా స్మార్ట్ పరికరాలు ఈ వివరాలను రోజంతా నమోదు చేసి, కృత్రిమ మేధ సహాయంతో విశ్లేషించి వ్యక్తిగత ఆరోగ్య అంచనాలను అందిస్తున్నాయి. ప్రతి మహిళ శరీరం భిన్నంగా స్పందించడంతో వ్యక్తిగత ఆరోగ్య నమూనాలను రూపొందించే దిశగా ఈ సాంకేతికత అభివృద్ధి చెందుతోంది.

​ఈ సాంకేతికత సంతానోత్పత్తి ప్రణాళికకూ దోహదపడొచ్చు. అండోత్సర్గం, గర్భధారణకు అనుకూల సమయాన్ని మరింత కచ్చితంగా గుర్తించడంలో తోడ్పడవచ్చని పరిశోధనలు సూచిస్తున్నాయి. అలాగే రుతుచక్రంలో అసాధారణ మార్పులు, నెలసరి ఆలస్యం, హార్మోన్ల అసమతుల్యత వంటి సంకేతాలను ముందుగానే గుర్తించి వైద్యులను సంప్రదించేందుకు సూచనలు ఇవ్వగల సామర్థ్యాన్ని కూడా ఈ పరికరాలు సంతరించు కుంటున్నాయి. ​​అయితే ఈ పరికరాలకు పరిమితులు కూడా ఉన్నాయి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న చాలా పరికరాలు హార్మోన్లను నేరుగా కొలవవు. హార్మోన్ల ప్రభావంతో శరీరంలో జరిగే మార్పులను మాత్రమే నమోదు చేస్తాయి. జ్వరం, ఒత్తిడి, నిద్రలేమి, ప్రయాణం, వ్యాయామం వంటి అంశాలు కూడా ఈ గణాంకాలను ప్రభావితం చేయవచ్చు. అందువల్ల ఇవి ఇచ్చే సమాచారం ఒక సూచన మాత్రమే. వైద్య పరీక్షలకు లేదా వైద్యుల సలహాకు ఇవి ప్రత్యామ్నా యం కావని నిపుణులు సూచిస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -