Saturday, July 18, 2026
E-PAPER
Homeఆటలువాషింగ్టన్‌ సుందర్‌ ఔట్‌

వాషింగ్టన్‌ సుందర్‌ ఔట్‌

- Advertisement -

గాయంతో మూడో వన్డేకు దూరం
లండన్‌
: భారత స్పిన్‌ ఆల్‌రౌండర్‌ వాషింగ్టన్‌ సుందర్‌ గాయం బారిన పడ్డాడు. ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో మరో స్పిన్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌తో కలిసి అజేయ సెంచరీ భాగస్వామ్యంతో భారత్‌కు విజయాన్ని అందించిన వాషింగ్టన్‌ సుందర్‌.. సోఫియా గార్డెన్స్‌లో జరిగిన రెండో వన్డేలో గాయపడ్డాడు. 5 బంతుల్లో 2 పరుగులే చేసిన వాషింగ్టన్‌ సుందర్‌.. వికెట్ల మధ్య పరుగు తీస్తూ తొడ కండరాల గాయానికి గురయ్యాడు. కాలు నొప్పితో బాధపడిన వాషింగ్టన్‌ సుందర్ ఫిజియోథెరపిస్ట్‌ సాయంతో బ్యాటింగ్‌ కొనసాగించినా తర్వాతి బంతికే వికెట్‌ కోల్పోయాడు. ఆ తర్వాత వాషింగ్టన్‌ సుందర్‌ ఫీల్డింగ్‌కు రాలేదు. పేస్‌ ఆల్‌రౌండర్లు హార్దిక్‌ పాండ్య, నితీశ్‌ కుమార్‌ రెడ్డిలు గాయంతో వన్డే జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే. తాజాగా వాషింగ్టన్‌ సుందర్‌ సైతం గాయం బారిన పడ్డాడు. వాషింగ్టన్ సుందర్‌కు గాయంతో లండన్‌లో ఆదివారం జరిగే మూడో వన్డేకు చైనామన్‌ స్పిన్నర్‌ కుల్‌దీప్‌ యాదవ్‌ను తుది జట్టులోకి తీసుకునే వీలుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -