నవతెలంగాణ జన్నారం దండేపల్లి
దండేపల్లి మండల కేంద్రంలోని”పద్మశాలి భవనం”ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని…వివిధ రంగాలలో నిష్ణార్తులైన వారికీ అవార్డ్స్ అందించడం జరిగింది,ఈ కార్యక్రమంలో గత 15 సంవత్సరాలనుండి అలాగే తెలంగాణ మలిదశ ఉద్యమంలో ధూందాం”కళాకారిణిగా మొదలుకొని ఇప్పుడు కూడా తన ఆటా-పాటల ద్వారా వివిధ ప్రభుత్వ-ప్రైవేట్ శాఖలో కార్యక్రమాలు నిర్వహిస్తున్న ఉత్తమ గాయనిగా లింగంపల్లి శ్రావణికి అవార్డు అందిచారు. కొల్లూరి రవికుమార్ నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా జాతీయ అధ్యక్షురాలు బండ శంకరి ఉపాధ్యక్షులు మామిడిపెల్లి బానయ్య, కొంకటి లక్ష్మినారాయణ, నేరుగట్ల రాజలింగు, ఉప్పులేటి తదితరులు పాల్గొన్నారు.



