Thursday, March 12, 2026
E-PAPER
Homeజాతీయంచ‌మురు నిల్వ‌ల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న

చ‌మురు నిల్వ‌ల‌పై కేంద్రం కీల‌క ప్ర‌క‌ట‌న

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: ప‌శ్చిమాసియాలో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయిల్ దాడుల‌తో చ‌మురు సంక్షోభం తలెత్తిన విష‌యం తెలిసిందే. గ‌ల్ఫ్ దేశాల నుంచి క్రూడాయిల్ దిగుమ‌తులు నిలిచిపోయ్యాయి. దీంతో ప‌లు దేశాల్లో ఇంద‌న నిల్వ‌లు త‌గ్గుముఖంప‌ట్టాయి. ఈక్ర‌మంలో రెండో విడ‌త బ‌డ్జెట్ పార్ల‌మెంట్ స‌మావేశాల్లో గ్యాస్, చ‌మురు నిల్వ‌ల‌పై చ‌ర్చ పెట్టాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి. పార్ల‌మెంట్ మ‌క‌ర ద్వారం వద్ద మూడు రోజులు నిర‌స‌న ప్ర‌ద‌ర్శ‌న‌లు చేప‌ట్టాయి. ప్ర‌తిప‌క్షాల ఆందోళ‌న‌ల‌కు త‌లొగ్గిన బీజేపీ ప్ర‌భుత్వం కేంద్ర పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి పార్ల‌మెంట్‌లో కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు.

ఇండియాలో ఇంధన కొరత లేదని, తగినన్ని క్రూడాయిల్ నిల్వలు ఉన్నాయని కేంద్ర పెట్రోలియం, సహజ తెలిపారు. పెట్రోల్, డీజిల్, విమాన ఇంధన సరఫరాలో ఎలాంటి కొరత లేదని చెప్పారు. దేశీయ రిఫైనరీలు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్నాయని అన్నారు. ప్రజలు ఎలాంటి వదంతులు వ్యాప్తి చేయవద్దని కోరారు. హర్మూజ్ సంక్షోభంతో భారత్‌కు సంబంధం లేదు. హర్మూజ్ జలసంధి భారత్‌కు తెరిచారు. ప్రధానమంత్రి చర్చలతో పరిస్థితులు సర్దుకుంటున్నాయి’ అని హర్దీప్ సింగ్ తెలిపారు. ఎలాంటి సంక్షోభం తలెత్తినా ఎదుర్కునేందుకు కూడా కేంద్రం సిద్ధంగా ఉందని చెప్పారు.

డొమెస్టిక్ సిలిండర్ల సరఫరాకు ఎలాంటి ఇబ్బందులు లేవని మంత్రి వివరించారు. సిలిండర్ల సరఫరాలో ఆసుపత్రులు, విద్యాసంస్థలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. సిలిండర్ బుకింగ్‌కు నగరాల్లో 25 రోజుల వ్యవధి, గ్రామాల్లో 45 రోజుల వ్యవధి అమలు చేస్తున్నట్టు చెప్పారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -