నవతెలంగాణ – రాయపోల్ : పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించి రాబోయే వార్షిక పరీక్షలలో పాఠశాల విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి మండలానికి పేరు తీసుకురావాలని ఆకాంక్షించడం జరిగిందని మండల విద్యాశాఖ అధికారి రాజగోపాల్ రెడ్డి అన్నారు. గురువారం రాయపోల్ మండలం రామారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి విద్యార్థులకు వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థి లక్ష్యాన్ని నిర్ణయించుకుని క్రమశిక్షణతో చదువుకుంటే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు. ఉపాధ్యాయుల మార్గదర్శకత్వాన్ని పాటిస్తూ కష్టపడి చదివి ఉత్తమ ఫలితాలు సాధించాలని సూచించారు. అనంతరం పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు రాజమహేంద్ర రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు పాఠశాలలో నేర్చుకున్న విలువలను జీవితంలో అమలు చేసుకుంటూ మంచి పౌరులుగా ఎదగాలని అన్నారు. పదో తరగతి పరీక్షలు ప్రతి విద్యార్థి జీవితంలో ముఖ్యమైన దశ అని, అందరూ పట్టుదలతో చదివి మంచి మార్కులు సాధించాలని సూచించారు. అనంతరం ఉపాధ్యాయులు విద్యార్థులకు పరీక్షల్లో విజయం సాధించాలని ఆశీర్వదిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీరాములు, వేణుగోపాల్ రెడ్డి, యాదగిరి, జ్యోతిలక్ష్మి, సంపత్, చందు, రవికుమార్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
జెడ్పీహెచ్ఎస్ రామారంలో పదో తరగతి విద్యార్థులకు వీడ్కోలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



