Thursday, August 7, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలునా తప్పు లేకుండా క్షమాపణ చెప్పను: కమల్‌హాసన్

నా తప్పు లేకుండా క్షమాపణ చెప్పను: కమల్‌హాసన్

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: ప్రముఖ నటుడు కమల్ హాసన్ కన్నడ భాషపై తాను చేసిన వ్యాఖ్యల విషయంలో క్షమాపణ చెప్పాలనే డిమాండ్లను నిర్ద్వంద్వంగా తోసిపుచ్చారు. నేనేం తప్పు చేశానని క్షమాపణలు చెప్పాలి?… నేను తప్పు చేస్తేనే క్షమాపణలు చెబుతాను అని స్పష్టం చేశారు. ‘థగ్ లైఫ్‌’ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకలో కన్నడ భాష గురించి కమల్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపాయి. ఈ వివాదంపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన చేసిన వ్యాఖ్యలు మరింత చర్చనీయాంశంగా మారాయి.

“నేను ఏదైనా విషయంలో తప్పు చేస్తే కచ్చితంగా క్షమాపణ చెబుతాను. తప్పు చేయనప్పుడు క్షమాపణ చెప్పను. ఇది నా పద్ధతి. భారతదేశం ప్రజాస్వామ్య దేశం. నేను చట్టాన్ని, న్యాయాన్ని పూర్తిగా నమ్ముతాను, వాటిని గౌరవిస్తాను” అని కమల్ హాసన్ పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రజలు అనవసరంగా జోక్యం చేసుకోవద్దని కూడా ఆయన విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img