Friday, March 13, 2026
E-PAPER
Homeఅంతర్జాతీయంపాక్‌పై ఆప్ఘానిస్థాన్ ప్ర‌తీకార‌దాడులు

పాక్‌పై ఆప్ఘానిస్థాన్ ప్ర‌తీకార‌దాడులు

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: పాకిస్థాన్‌పై ఆప్ఘానిస్థాన్ ప్ర‌తీకార‌దాడుల‌కు దిగింది. ఖైబర్ పఖ్తుంఖ్వాలోని కోహత్ ప్రాంతంలో పాకిస్తాన్ సైన్యం వ్యూహాత్మక సైనిక కేంద్రాలు, సంస్థాపనలపై ప్రతీకార డ్రోన్ దాడులు జరిగాయని ఆఫ్ఘనిస్తాన్ రక్షణ మంత్రిత్వ శాఖ శుక్రవారం తెలిపింది. ప్రతీకార దాడుల సమయంలో డ్యూరాండ్ లైన్ వెంబడి ఉన్న యుద్ధ కమాండ్ సెంటర్ అయిన పాకిస్తాన్ కోహత్ మిలిటరీ ఫోర్ట్, కోట కమాండర్ కార్యాలయం గణనీయమైన నష్టాన్ని చవిచూశాయ‌ని సోష‌ల్ మీడియా ఎక్స్ వేదిక‌గా వెల్ల‌డించారు. ఈ డ్రోన్ దాడుల‌తో పాక్ కీల‌క ఆర్మీ క్యాంపులు, ప‌లు భ‌వ‌నాలు ధ్వంస‌మైయ్యాయి. అంత‌క‌ముందు అఫ్గానిస్థాన్ రాజధాని కాబుల్‌తో పాటు సరిహద్దు ప్రావిన్స్‌లపై ఈ దాడులు జ‌రిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -