Friday, March 13, 2026
E-PAPER
Homeజిల్లాలుఅమిత్ షాకు కేటీఆర్ లేఖ‌

అమిత్ షాకు కేటీఆర్ లేఖ‌

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్‌: రాష్ట్రంలో దిగజారిన శాంతిభద్రతలు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న బినామీ వ్యాపారాల పైన కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. రేవంత్ రెడ్డి బినామీ కంపెనీ KLSR ఇన్‌ఫ్రాటెక్ కంపెనీ పైన నమోదైన కేసులు విచారణ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు సాక్ష్యాధారాలను తారుమారు చేసింద‌న్నారు. ముఖ్యమంత్రి చేస్తున్న అనుచిత లబ్ధి ప‌నుల‌పై సీబీఐ (CBI), ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED), సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (SFIO) వంటి ఏజెన్సీలతో సంపూర్ణ దర్యాప్తు చేయించాలని తన లేఖలో కేటీఆర్ కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -