- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్
ఉచిత గాలికుంటు నివారణ టీకాలను పశువుల దారులంతా సద్వినియోగం చేసుకోవాలని విఏ సునీత కోరారు. శుక్రవారం మద్నూర్ మండలంలోని చిన్న షక్కర్గ గ్రామపంచాయతీ పరిధిలోని సలబద్పూర్ గ్రామంలో పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి టీకాలు వేశారు. ఈ గ్రామంలో 31 ఆవులకు 74 గేదెలకు టీకాలు వేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో పశువైద్య సిబ్బంది, పశువుల దారులు పాల్గొన్నారు.
- Advertisement -



