Friday, March 13, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్బీఆర్ఎస్ సర్పంచులు చేస్తున్న అసత్య ఆరోపణలను తక్షణమే మానుకోవాలి

బీఆర్ఎస్ సర్పంచులు చేస్తున్న అసత్య ఆరోపణలను తక్షణమే మానుకోవాలి

- Advertisement -

సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు – పాశం శివానంద్..
నవతెలంగాణ- భువనగిరి కలెక్టరేట్

ప్రజలకు సేవ చేస్తున్న నాయకుడిపై రాజకీయ ప్రయోజనాల కోసం తప్పుడు ప్రచారం చేయడం సరైంది కాదని సర్పంచుల ఫోరం అధ్యక్షులు పాశం శివానంద్ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం నిర్వహించి, మాట్లాడారు. గెలిచిన రెండు సంవత్సరాలలోనే 56 కోట్ల హెచ్ఎండిఏ  , 25 కోట్ల ఉపాధి హామీ నిధులను మంజూరు చేయించి, అన్ని గ్రామాలకు కేటాయింపు జరిగిందని, సర్పంచులుగా గెలిచిన 2 నెలల్లోనే నిధులు కేటాయించలేదు అని అనడం సరైనది కాదని,  ప్రతీ ఒక్క బి ఆర్ ఎస్  సర్పంచ్ గ్రామ భవిష్యత్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడాలనారు.  సంక్షేమ పథకాల అమలులో అన్ని పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతీ ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా ఎమ్మెల్యే  చూస్తున్నారని, ఇందిరమ్మ ఇళ్ల ఎంపిక పూర్తిగా అధికారుల ఆధ్వర్యంలో ప్రభుత్వ యాప్ ద్వారా పారదర్శకంగా జరిగిందని,  ఇందులో ఎలాంటి రాజకీయ జోక్యం లేదని అన్నారు. 

భువనగిరి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని ఓర్వలేక కొందరు బి ఆర్ ఎస్  సర్పంచ్‌లు ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని,  భువనగిరి–జంపల్లి బ్రిడ్జ్ నిర్మాణం ప్రజలకు ఎంత ఉపయోగకరంగా మారిందో ఒకసారి వచ్చి చూసి మాట్లాడాలని మేము సవాలు చేస్తున్నామన్నారు.  వలిగొండ సంగం బ్రిడ్జ్ కూడా మంజూరు అయిందని, బీబీనగర్ -పోచంపల్లి మధ్య జూలూరు వంతెన అడ్డంకులు పూర్తిగా తొలగించ్చామని, జరుగుతున్న అభివృద్ధి కనబడకపోతే అది రాజకీయ అంధత్వమే తప్ప వాస్తవం కాదనారు. 

ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే కుంభం అనీల్ కుమార్ రెడ్డి  నిరంతరం కృషి చేస్తున్నారనారు. అభివృద్ధి పనులకు సహకరించాలి కానీ తప్పుడు ఆరోపణలు చేయడం మానుకోవాలనారు. బునాదిగాని కాల్వను పరిశీలన చేయండనారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు ఎలిమినేటి కృష్ణారెడ్డి, సర్పంచులు చిన్నబత్తిని లుర్డయ్యా, మానస సురేష్,నాయకులు పక్కీర్ కొండల్ రెడ్డి,కనుకుంట్ల బాబురావు,ఏడుమేకల మహేష్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -