Saturday, March 14, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం

- Advertisement -

నవతెలంగాణ – యాదగిరిగుట్ట రూరల్ 
ప్రజా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు బీర్ల ఐలయ్య అన్నారు. శుక్రవారం, యాదగిరిగుట్ట మండలం చోల్లేరు, వంగపల్లి గ్రామాలలో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమకు ప్రభుత్వం కల్పించిన ఇల్లు కల నిజం కావడంతో ఎంతో ఆనందంగా ఉందని, బీర్ల ఐలయ్యకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి పేద కుటుంబానికి సొంత ఇల్లు కల్పించాలనే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేస్తుందని అన్నారు.

ఇల్లు లేని పేదలకు గౌరవప్రదమైన జీవితం కల్పించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారునికి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు చేరేలా కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల ఆశయాలను నెరవేర్చేందుకు ఎల్లప్పుడూ తన వంతు సహకారం లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చీర శ్రీశైలం, మంగ సత్యనారాయణ, చోల్లేరు గ్రామ సర్పంచ్ చిన్నం మమత శ్రీనివాస్, వంగపల్లి గ్రామ సర్పంచ్ రవళి, మాజీ ఎంపిటిసి అరుణ, మాజీ పిఎసిఎస్ డైరెక్టర్ గడ్డమీది శ్రీనివాస్ గౌడ్, కానుగు బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -